Groom's friends make the bride sign a cricket deal at the wedding! – Viral
mictv telugu

భర్త క్రికెట్ ఆడేందుకు అనుమతిచ్చిన భార్య.. బాండ్ పేపరుపై సంతకం

September 11, 2022

పెళ్లి వేడుకలో నూతన దంపతుల స్నేహితులు చేసే హడావుడి అంతాఇంతా కాదు. వధూవరులిద్దరినీ ఆటపట్టిస్తుంటారు. అయితే తమిళనాడు మదురైలోని జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లి కుమార్తెతో ఏకంగా బాండ్నే రాయించుకున్నారు వరుడి స్నేహితులు. ఆ బాండ్లో ఏముందో, అసలెందుకు అలా చేశారో ఓసారి చూడండి.

తమిళనాడుకు చెందిన హరిప్రసాద్ స్వస్థలం ఉసిలంపాటి సమీపంలోని కీజా పుదూర్ అనే గ్రామం. తేనీలోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న ఆయన ‘సూపర్ స్టార్ క్రికెట్ క్లబ్’ జట్టుకు కెప్టెన్. అతడికి మదురైకి చెందిన పూజ అనే యువతిని వివాహం కుదిరింది. అయితే నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన పెళ్లికొడుకు స్నేహితులు.. పెళ్లి కుమార్తెకు ఓ కండీషన్ పెట్టారు. శని, ఆదివారాల్లో హరిప్రసాద్ను క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని కోరారు. రూ.20 బాండ్ పేపరు మీద సంతకం చేయమన్నారు. ఆటపట్టించేందుకు చేస్తున్నారేమోనని పూజ అనుకుంది. అయితే బాండ్పై సంతకం చేయమని పూజపై ఒత్తిడి తెచ్చారు హరిప్రసాద్ స్నేహితులు. అప్పుడు పూజ.. బాండ్పై సంతకం చేసింది. “సూపర్ స్టార్ టీమ్ కెప్టెన్ అయిన నా భర్త హరిప్రసాద్‌ను ఇక నుంచి అన్ని శని, ఆదివారాల్లో క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తాను’ అని హామీ ఇచ్చింది.