Ground Water Automatically Comes Out From Hand Bore In Konaseema District
mictv telugu

విచిత్రం.. చేతిపంపు నుంచి ఆగకుండా వస్తున్న నీళ్లు

July 18, 2022

ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరికి వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. ఏపీలోని గోదావరి పరివాహక ప్రాంతాలన్ని నీట ముగినిపోగా.. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. గోదావరికి వరద భారీగా చేరడంతో.. కొన్ని గ్రామాల్లోని బోర్లలో నీళ్లు ఉప్పొంగుతున్నాయి. చేతి పంపుం కొడితేనే నీళ్లు వస్తాయి కానీ.. ఎవరూ కొట్టకుండానే హ్యాండ్ పంపుల నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం చింతలమెరకలో దాకే జనార్ధనరావు అనే వ్యక్తి ఇంట్లో ఉన్న బోరు నుంచి నీళ్లు ఇలానే ఉబికి వస్తున్నాయి. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బెల్లంపూడి సమీపంలో చేతి పంపును ఎవరూ కొట్టకుండా స్వచ్చందంగా మంచి నీరు వచ్చింది. వరదల కారణంగానే ఇలా నీరు వస్తుందని స్థానికులు అంటున్నారు. రెండు, మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.