గ్రూప్-1 అభ్యర్థులు అవస్థలు.. చేతులెత్తిసిన అధికారులు - MicTv.in - Telugu News
mictv telugu

గ్రూప్-1 అభ్యర్థులు అవస్థలు.. చేతులెత్తిసిన అధికారులు

April 30, 2022

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ తాజాగా పోలీస్, గ్రూప్ 1 శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. మరికొంతమంది అభ్యర్థులు ఇదివరకే కోచింగ్ తీసుకొని, మార్కెట్లో దొరికిన పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇదే అదునుగా తీసుకొని కొంతమంది రైటర్లు మార్కెట్లో పుస్తకాల మీద పుస్తకాలను విడుదల చేస్తూ ఈ పుస్తకాలు కొనండి – ఉద్యోగాన్ని సాధించండి అంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. అభ్యర్థులు ఆ ప్రచారాలను నమ్మి పుస్తకాలను కొనుక్కుంటున్నారు.

ఈ క్రమంలో సబెక్ట్ నిపుణులు అభ్యర్థులకు పుస్తకాలపై పూర్తైన అవగాహన కల్పిస్తున్నారు. మార్కెట్లో విడుదల అవుతున్న ఏ పుస్తకం పడితే, ఆ పుస్తకం కొనకండి. తెలుగు అకాడమీ పుస్తకాలకు ముందుగా ప్రాధాన్యతనివ్వండి అంటూ తెలియజేస్తున్నారు. దీంతో అభ్యర్థులు హిమయత్ నగర్‌లో ఉన్న తెలుగు అకాడమీకి క్యూ కడుతున్నారు. ఫలానా పుస్తకాలు కావాలని, అకాడమీ అధికారులను వేడుకుంటున్నారు. అభ్యర్థులు అడుగుతున్న పుస్తకాలు అకాడమీలో లేకపోవడంతో అధికారులు చేతులెత్తేస్తుస్తోన్నారు.

ముఖ్యంగా గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైందని ఓవైపు ఆనందంగా ఉన్న సిలబస్‌కు సంబంధించిన సరైనా స్టడీ మెటీరియల్ అందుబాటులో లేకపోవడంతో అభ్యర్థులు నానా అవస్థలు పడుతున్నారు. అకాడమీలో గ్రూప్1కు సంబంధించిన పుస్తకాలు దొరకకపోవడంతో జిరాక్స్ సెంటర్లలో దొరుకుతాయేమోనని ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు తమ మిత్రులు రాసుకున్న నోట్సును జిరాక్స్ తీయించుకుంటున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలున్నాయి. అభ్యర్థులకు ప్రతి రోజు విలువైనదే కావడంతో స్టడీమెటీరియల్ వెతుకులాటలో తీవ్రమైన ఆందోళనకు గురౌతున్నారు.