తెలంగాణలో పదిరోజుల్లో గ్రూప్-1 నోటిఫికేషన్! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో పదిరోజుల్లో గ్రూప్-1 నోటిఫికేషన్!

March 26, 2022

rkcr

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నిరుద్యోగులకు మార్చి 9వ తేదీన కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా శుభవార్తను చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 91వేల ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారమే ఇటీవలే 30,453 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతులు ఇస్తూ, జీవోలు విడుదల చేసింది. దీంతో నిరుద్యోగులు అలర్ట్ అయ్యి, కొంతమంది కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ఇంకొంతమంది పుస్తకాలతో ఇంట్లోనే ఉంటూ కుస్తీ పడుతున్నారు. ఈ క్రమంలో డీఎస్సీకి సంబంధించి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది.

అయితే గ్రూప్స్ నోటిఫికేషన్ ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్తను తెలిపనుంది. 503 గ్రూప్‌-1 పోస్టులను భర్తీ చేయడానికి టీఎస్‌పీఎస్సీ మరో పదిరోజుల్లో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. ప్రాథమిక సమాచారం మేరకు.. మొత్తం పోస్టుల్లో 19 శాఖలకు చెందినవిగా ఉన్నట్టుగా సమాచారం. ఇండెంట్‌ కోసం టీఎస్‌పీఎస్సీ అధికారులు 19 శాఖల ఉన్నతాధికారులతో మరోసారి శనివారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆయాశాఖల అధికారులకు నిర్దేశిత ప్రొఫార్మాను అందజేశారు. అన్ని వివరాలు సకాలంలో అందితే, ఏప్రిల్‌లో గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ జారీఅయ్యే అవకాశాలున్నట్టుగా సమాచారం.