ఆంధ్రప్రదేశ్ లో జనవరి 8న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రైమరీ ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే జనవరి 11 నుంచి 13 వరకు వంద రూపాయల ఫీజు కట్టి ఆన్ లైన్ ద్వారా తెలుపవచ్చని సూచించింది. ఆన్ లైన్ కాకుండా వేరే విధానాల్లో వచ్చే అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించబోమని స్పష్టం చేసింది. అలాగే గడువు తేదీ తర్వాత వచ్చే అభ్యంతరాలను కూడా పట్టించుకోమని తేల్చి చెప్పేసింది. మొత్తం గ్రూప్ 1 పోస్టులు 111 ఉండగా, వీటికి 87 వేల 718 మంది పరీక్ష రాశారు. మూడు వారాల తర్వాత ఫలితాలు విడుదల చేసి తర్వాత 90 రోజుల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది.