తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)లో తవ్వేకొద్దీ లీకేజీలు బయటపడుతున్నాయి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ వ్యవహారంతోపాటు చాలా పరీక్షల క్వశ్చర్ పేపర్లు బయటకి వెళ్లాయి. అసిస్టెంట్ ఇంజనీరింగ్(ఏఈ) పశ్నపత్నం లీకైన విషయం బయటికి వచ్చిన కాసేపటికే గ్రనూప్ 1 పరీక్ష పేపర్ కూడా లీకైనట్లు అనుమానాలు వస్తున్నాయి. లీకేసీ సూత్రధారి, సంస్థ ఉద్యోగి ప్రవీణే దీన్ని బయటికి తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు అతడు కూడా హాజరయ్యాడు. జనవరిలో ఈ టెస్ట్ ఫలితాలు వచ్చాయి. అయితే కొన్ని కారణాలతో ప్రవీణ్ అర్హత సాధించలేకపోయాడని సమాచారం. అతనికి 103 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. పేపర్ లీకేజీల నేపథ్యంలో సంబంధిత పరీక్షలను రద్దు చేయాలా వద్దా అని టీపీస్పీఎస్సీ తర్జన భర్జన పడుతోంది. గ్రూప్ 1 టెస్టు రాసిన వారిలో 25 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. లీకేజీలో నేపథ్యంలో పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు తలపట్టుకుంటున్నారు. కష్టపడి చదివితే ఇలా అయిందేమిటా అని నిరాశకు గురువుతున్నారు.
ఫోన్ అంతా అశ్లీలమే.
ప్రవీణ్‌ను విచారిస్తున్న పోలీసులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అతడు పలువురు మహిళలతో రాసలీలలు నడుపుతున్నట్లు ఆధారాలు లభించాయి. చాటింగులో అశ్లీల చిత్రాలు, సంభాషణలు బయటపడ్డాయి. ప్రవీణ్ కారుణ్య నియమాకం కింద ఉద్యోగంలో చేరాడు. ఏపీకి చెందిన అతని తండ్రి ఉద్యోగంలో ఉండగానే చనిపోవడంతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. 2017 నుంచి పనిచేస్తున్న ప్రవీణ్ ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ స్థాయిలో కమిషన్ కార్యదర్శికి పీఏగా పనిచేస్తున్నాడు. ఉన్నత స్థాయి అధికారుల కంప్యూటర్లకు చెందిన పాస్ వర్డుల కనుక్కుని లీక్ చేసినట్లు పోలీసుల చెబుతున్నారు పైస్థాయి అధికారుల అండదండలు లేనిదే ఇంత భారీ నేరాలకు పాల్పడే అవకాశం లేదని అనుమానిస్తున్నారు. పేపర్ లీకేజీలతో అతడు కోట్లకుపైగానే వెనకేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఏఈ పేపర్లు ఇవ్వడానికి ఇద్దరు అభ్యర్థుల నుంచే అతడు దాదాపు 14 లక్షలు వసూలు చేయడంతో భారీగానే సొమ్ము చేతులు మారి ఉంటుందని చెబుతున్నారు.
బీజేపీ నిరసన
లీకేజీలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ కార్యకర్తలు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వారిని చెదరగొడుతున్నారు. ల