గ్రూప్-2 ఫలితాలు వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ - MicTv.in - Telugu News
mictv telugu

గ్రూప్-2 ఫలితాలు వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ

October 24, 2019

Group-2 results revealed by TSPSC

తెలంగాణలో గ్రూప్-2 తుది ఫలితాలను టీఎస్‌పీఎస్సీ ఇవాళ విడుదల చేసింది. ఫలితాలను టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి విడుదల చేశారు. మొత్తం 1032 పోస్టులకు గాను 1027 పోస్టులను భర్తీ చేశారు. వీరిలో 259 డిప్యూటీ తహసీల్దార్లుగా, 284 మందిని ఎక్సైజ్ ఎస్సైలుగా, 156 మందిని వాణిజ్య పన్నుల అధికారులుగా నియామించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. మిగతావారిని మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులుగా ఉద్యోగాలు చేపట్టనున్నారు. 2016 నవంబర్‌లో గ్రూప్-2 పోస్టులకు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.