Group 4 notification released by TSPSC
mictv telugu

నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల

December 1, 2022

తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 4 కేటగిరీలో మొత్తం 9,168 ఉద్యోగాలను భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించింది. ప్రకటించింది.

ఏప్రిలో పరీక్ష నిర్వహించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మేరకు మంత్రి హరీష్ రావు ట్విట్టర్ లో ప్రకటించారు. ఈ పోస్టులకు నవంబర్ 25న ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా నోటిఫికేన్ విడుదలైంది. ఇందులో వ్యవసాయశాఖ-44, బీసీ సంక్షేమశాఖ-307, పౌరసరఫరాల శాఖ-72, అటవీశాఖ-23, వైద్యారోగ్యశాఖ-338, ఉన్నత విద్యాశాఖ-742, హోంశాఖ-133, నీటిపారుదల శాఖ-51, మైనార్టీ సంక్షేమశాఖ-191, పురపాలక శాఖ-601, పంచాయతీరాజ్-1,245, రెవెన్యూశాఖ-2,077, సెకండరీ విద్యాశాఖ-97, రవాణాశాఖ-20,
గిరిజన సంక్షేమ శాఖ-221, మహిళా, శిశు సంక్షేమం-18, ఆర్థికశాఖ-46, కార్మికశాఖ-128, ఎస్సీ అభివృద్ధి శాఖ-474, యువజన సర్వీసులు-13, జూనియర్ ఆడిటర్: 18 పోస్టులు, వార్డ్ ఆఫీసర్: 1862 పోస్టులు ఉన్నాయి.