పెరుగుతూనే ఉన్న బంగారం, వెండి.. ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

పెరుగుతూనే ఉన్న బంగారం, వెండి.. ఎంతంటే?

April 13, 2022

11

దేశ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా వంటనూనెలపై, నిత్యావసరాలపై, వంట గ్యాస్‌పై, కూరగాయలపై, పెట్రోల్, డీజిల్‌పై ధరలు రోజురోజుకు స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు సైతం అదే బాట పట్టాయి. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కారణంగా విపరీతంగా పెరిగిన బంగారం ధర కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈనెల నుంచి పెళ్లిళ్లి భారీగా జరగనున్న నేపథ్యంలో మళ్లీ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో బంగారం కొనేవారు పెరిగిన ధరను చూసి వెనకడుగు వేస్తున్నారు. మరికొంతమంది ధర పెరిగిన, తగ్గిన అవేమి పట్టించుకోకుండా జ్యూవలరీల బాటపడుతున్నారు.

హైదరాబాదులో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్లు, పది గ్రాముల బంగారం రూ. 350 పెరిగి రూ. 49,350కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం, పది గ్రాముల ధర రూ. 390 పెరగడంతో తులం బంగారం రూ. 53,840కి చేరింది. వెండి ధర కిలోకు రూ. 1,100 పెరిగింది. దీంతో రూ. 73,800కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్టణంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.