దీనికీ....ఆయనేనా.... - MicTv.in - Telugu News
mictv telugu

దీనికీ….ఆయనేనా….

June 19, 2017

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ అమలు పై గట్టి  పట్టుదలతో ఉంది. అందుకే జనాలకు  బాగా  అర్థం చేయించేందుకు దేశంలోనే   పేద్ద స్టార్ అమితాబ్ ను దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక  చేసింది.  దీనికి సంబంధించిన చిన్న వీడియో కూడా షూట్ చేస్తున్నరట.  ఇంతకు ముందు స్వచ్ఛ్ భారత్ కూడా బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు పన్నులకూ అయనే. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్  అని అమితాబ్ తో చెప్పిస్తారట. కట్టేది పన్నులు… ఈయన చెప్పినా… చెప్పకున్నా జనాలకు  టక్కున సమజ్ అయితది. ఎందుకంటే అవి పైసలు.  ఇంకో మాటల చెప్పాలంటే…. కొత్త పన్నులకో బ్రాండ్ అంబాసిడర్  ఎందుకనే అభిప్రాయం కూడా జనాల్ల ఉంది. ఏ బ్రాండ్  పై ఎంత  పన్ను వేస్తారో  లక్షల పేపర్లు, వందల టీవీలు చెప్తనే ఉండే. ముక్కు పిండి పన్నులు ఎట్లా వసూలు చేయాల్నో… బ్రాండ్ అంబాసిడర్ ను పెట్టి మరీ చెప్తున్నరు. మంచిదే. అయితే సిన్మా రంగంపై  భారీ ట్యాక్స్ వేసిన ప్రభుత్వం అదే స్టార్ తో జనాలను మెప్పించాలనుకోవడం కొసమెరుపు.