GST amount from July 18. New prices come into effect
mictv telugu

జూలై 18 నుంచి జీఎస్టీ మోత..అమల్లోకి కొత్త ధరలు

June 30, 2022

దేశవ్యాప్తంగా జూలై 18వ తేదీ నుంచి జీఎస్టీ మోత మోగనుంది. రూ.1000 కంటే తక్కువ విలువైన హోటల్ గదుల అద్దెపై 12 శాతం, ఆసుపత్రిలో రోగికి రూ. 5000కి మించి అద్దె గది తీసుకుంటే, ఐటీసీ లేకుండా 5 శాతం, బ్యాటరీ ప్యాక్ అమర్చినా, లేకపోయిన విద్యుత్తు వాహనాలకు 5 శాతం అలాగే, ప్యాక్ చేసిన లేబుల్డ్ గోధుమ పిండి, అప్పడాలు, పన్నీర్, పెరుగు, మజ్జిగ, మాంసం, చేపలు, తేనె, ఎండు చిక్కుళ్లు, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్ పై 5 శాతం జీఎస్టీ పడనుందని అధికారులు కొత్తగా నిర్ణయించిన ధరల వివరాలను వెల్లడించారు.

జీఎస్టీ మండలి 47వ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపి, పలు నిర్ణయాలను తీసుకున్నారు. అనంతరం ఏఏ వస్తువులపై ఎంత శాతం మేరకు జీఎస్టీ పెరిగిందో, ఆ ధరలు ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయి అనే పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను విడుదల చేసిన చేశారు.

విడుదల చేసిన ప్రకటన ప్రకారం..” జులై 18 నుంచి కొత్తపన్ను రేట్లు అమల్లోకి రానున్నాయి. ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంకులపై 12 నుంచి 18 శాతం పెరిగింది. కత్తులు, కటింగ్ బ్లేడ్లు, పేపర్ కత్తులు, పెన్సిల్ చెక్కుకునే షార్ప్ నర్ల పై 18శాతం. ఎల్‌ఈడీ లైట్లు, ఫిక్సర్, వాటికి వినియోగించే మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులపై 12 నుంచి 18 శాతం. సోలార్ వాటర్ హీటర్, సిస్టంపై 5 నుంచి 12 శాతం. చెప్పులు, తోలు ఉత్పత్తుల తయారీ జాబ్ వర్క్‌లపై 5 నుంచి 12 శాతం. అలాగే, రోడ్లు, వంతెనలు, రైల్వేలు, మెట్రో, శుద్ధి ప్లాంట్లు, శ్మశానవాటికల కాంట్రాక్టు వర్కులపై 12 నుంచి 18 శాతం. టెట్రా ప్యాక్‌పై 12 నుంచి 18 శాతం. కట్ ఆండ్ పాలిష్ వజ్రాలపై 0.25 నుంచి 1.5 శాతం. చెక్కులు జారీ చేసినందుకు బ్యాంకులు వసూలు చేసే ఛార్జీ పై 18శాతం జీఎస్టీ పడునుంది” అని అధికారులు పేర్కొన్నారు.