కేంద్రంపై న్యాయ పోరాటం - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రంపై న్యాయ పోరాటం

August 8, 2017

ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ GST మీద తన గొంతును చాలా ఘాటుగానే వినిపించారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతున్నాయి కానీ మేము ప్రతీ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ వాదనను గట్టిగ వినిపించామన్నారు. 33 అంశాల్లో బుక్లెట్ తాయారు చేసి కౌన్సిల్ కి అందజేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏ వస్తువు ఏ స్లాబ్ లో ఉండాలో సిఫారసు చేసి భిన్నత్వం లో ఏకత్వం ఉన్న దేశం కాబట్టి ఒక్కో రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను బట్టి వస్తువులపై పన్నులు రూపొందించాలని చెప్పారు. ఉదాహరణకు బియ్యం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ లో అధికంగా పండుతుంది. గ్రానైట్ పరిశ్రమ తెలంగాణ, రాజస్థాన్ లలో అధికం, నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్ లో వెదురు ఉత్పత్తులు అధికం ఇలా రాష్ట్రాల వారీగా ప్రాధాన్యతలు ఉన్నప్పుడు కనీసం వారి వాదనలు వినాల్సిన అక్కరు GST కౌన్సిల్ పై ఉంది కానీ అది జరగడం లేదు ?

ప్రభుత్వాల మీదనే ప్రభుత్వం పన్ను విధించడం సరికాదు అని హెచ్చరించాం అయినా పట్టించుకోలేదు.
వర్క్స్ కాంట్రాక్ట్స్  మీద పన్ను వేయవద్దని చెప్తే 18 శాతం నుండి 12 శాతం కు మాత్రమే తగ్గించారు.  ఇది తెలంగాణ రాష్ట్రం మీద పెను భారం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి అంటే 24 వేల కోట్ల పన్ను కట్టాల్సి వస్తుంది. కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇది నష్టం కాదు అని బీజేపీ నేతలు ఎలా చెప్తారు ? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇవే కాకుండా బీడీ కార్మికులమీద, చేనేత మీద , వ్యవసాయ పనిముట్ల మీద, గ్రానైట్ మీద పన్ను భారం పడకుండా చూడాలని, చిన్న- మధ్యతరహా పరిశ్రమలు మూత పడేలా ఉండొద్దని, నిరుద్యోగ సమస్యలు పెరిగేలా నిర్ణయాలు ఉండకూడదు అని కోరామని. వీటన్నిటినీ కేంద్రం పెడ చెవిన పెట్టినప్పుడు చూస్తూ ఊరుకోలేం కదా అంటూ ఆర్థిక మంత్రి ఈటెల రాజెందర్ స్పంష్టం చేసారు.

రాష్ట్ర ప్రభుత్వం కోరిన అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించక పోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రతి దానిని రాజకీయం చేస్తున్నారని, మాది ప్రజల పక్షమని, సామాన్య ప్రజలమీద భారం పడితే ఎవరినీ సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. మాది ప్రజల అవసరాల మేరకు ఉండే మిత్రుత్వం మాత్రమే అన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసే సమయానికి ఏ వస్తువు మీద ఎంత పన్ను ఉందొ తెలియదని దేశం కోసం ఒక ప్రోగ్రెసివ్ నిర్ణయం కాబట్టే అనాడు స్వాగతించామని అన్నారు. ఈరోజు కొన్ని అంశాల్లో నష్టం జరుగుతుంది కాబట్టే నిలదీస్తున్నాం, అంతే కానీ మీలాగా మాది గుడ్డి వ్యతిరేకత కాదు అన్నారు.

ప్రజాస్వామ్యం లో మంత్రి వర్గం రాష్ట్ర ప్రభుత్వ సమిష్టి బాధ్యత. ఈటల రాజేందర్ అయినా, కేటీఆర్ అయినా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్తారే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలకు తావు ఉండదని అన్నారు. ఆ మాత్రం అవగాహన, ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. మీ విధానం అశాస్తీయం , తర్క విరుద్దమయినది అని అన్నారు. ప్రజల కోణంలో ఆలోచించాలి తప్ప ఇలాంటి అంశాలతో పబ్బం గడపవద్దు అని సలహా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతినకుండా చూస్తామంటున్నారు మంత్రి ఈటల రాజేందర్. మంత్రి గారి వాదనలో న్యాయం వుందని కాంగ్రెస్ తెలుసుకోలేకపోవడం శోచనీయం అని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఏమైనా GST దుష్పలితాల గురించి ముందుగానే తెలుసుకొని అప్పుడు మద్దత్తు తెలపకపోయుంటే ఇప్పుడు ఈ లొల్లే వుండకపోయుండేదేమో.