ఇళయరాజాకు జీఎస్టీ నోటీసులు.. ప్రచారానికి తెర - MicTv.in - Telugu News
mictv telugu

ఇళయరాజాకు జీఎస్టీ నోటీసులు.. ప్రచారానికి తెర

April 26, 2022

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవలే ఆదాయ పన్ను శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. రూ. 1.80 కోట్లు పన్ను కట్టాలంటూ జీఎస్టీ చెన్నై శాఖ మంగళవారం నోటీసులు ఇచ్చింది. ఈ పన్నుకు వడ్డీ, జరిమానా కలిపి కట్టాలని అందులో పేర్కొంది. ఈ పన్ను చెల్లింపుకు సంబంధించి ఇళయరాజాకు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ అయ్యాయి. కానీ, ఇళయరాజా స్పందించలేదు. కాగా, ఇటీవల ఇళయరాజా ప్రధాని మోదీని అంబేద్కర్‌తో పోల్చి మాట్లాడారు. ఆయనకు త్వరలో రాజ్యసభ ఎంపీ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. జీఎస్టీ తాజా చర్యతో ఆ ప్రచారానికి తెర పడినట్టైంది.