వయుస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు.. ప్రాణాలను తీసేస్తోంది. ఏ క్షణం ఎలా ఉంటామన్నది చెప్పలేని పరిస్థితి. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌లో ఓ ప్లేయర్ గుండెపోటుతో మరణించాడు. జీఎస్టీ ఉద్యోగులు, సురేంద్రనగర్ జిల్లా పంచాయతీ సభ్యుల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోర్ ఆడుతున్నాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు వసంత్‌కు ఛాతీలో నొప్పి వచ్చి, కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. వసంత్ గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా
గత కొంతకాలంగా యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక్క వారంలో నలుగురైదుగురు గుండెపోటుతో మరణించారు. కొందరు జిమ్ చేస్తూ గుండెపోటుకు గురవుతుండగా మరికొందరు పనిచేస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. నిన్న ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు మరణించడం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా అదోనిలో జిమ్‌లో వ్యాయామం చేస్తుండా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలంలో ఓ 19 ఏళ్ల యువకుడు డ్యాన్స్ వేస్తు ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్ళగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే.