GST evasion of Rs 55,575 cr detected in last 2 years,
mictv telugu

దేశంలో భారీగా జీఎస్టీ ఎగవేత..

November 10, 2022

జీఎస్టీ అమలును ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తోంది. పన్నువేగవేత సంస్థలపై అధికారులు కొద్ది రోజులుగా దృష్టించారు. ఈ క్రమంలోనే ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టి మోసాలను గుర్తిస్తున్నారు. గత రెండేళ్లలో రూ.55,575 కోట్లు విలువు చేసే జీఎస్టీ మోసాలు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. జీఎస్టీ మోసాలకు పాల్పడిన 700 మందిని అరెస్ట్ చేసి..22,300 నకిటీ జీఎస్టీ ఐడీ నెంబర్లను గుర్తించారు. అయితే గుర్తించిన మోసాలలో ఎంతవరకు వసూలు చేసారన్నది మాత్రం వెల్లడించలేదు. డీజీజీఐ, డీఆర్ఐ, ఐటీ,ఈడీ,సీబీఐ మధ్య సమన్వయంతోనే నిందితులు గుర్తింగలిగామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ తనిఖీ, ఇ-వే బిల్లులు, జీఎస్టీ రిటర్నులు ధ్రువీకరణ, ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయింపై ఆంక్షలు..వంటి చర్యలతో పన్ను ఎగవేతలను అరికడుతున్నారు.