GST Raid on Telugu movie companay UV creations related actor prabhas uppalapati
mictv telugu

ప్రభాస్ బంధుమిత్రుల యూవీ కంపెనీపై ఐటీ దాడులు..

November 2, 2022

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్‌తో పలు చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్ కంపెనీ చిక్కుల్లో పడింది. ఆర్థిక అవకతవకలు, జీఎస్టీ పన్ను ఎగవేత వంటి ఆరోపణలపై ఆదాయ పన్ను అధికారులు ఆ కంపెనీపై దాడి చేశారు. మంగళవారం ఉదయం నుంచి దాడులు జరిగిన విషయం రాత్రి పొద్దుపోయకగాని బయటికి రాలేదు.
యూవీ క్రియేషన్స్ సంస్థ ‘మిర్చి,’ ‘రాధే శ్యామ్’, ‘సాహో’ తదితర చిత్రాలు నిర్మించింది. సినిమాల నిర్మాణం, ఖర్చులు, ఆదాయ వనరులు వంటి అంశాలపై ఆరోపణలు, అనుమానాలు రావడంతో జీఎస్టీ అధికారులు దాడి చేశారు.

అయితే ఇదివరకూ యూవీపై ఐటీ దాడులు జరిగాయని, అలాంటివి మామూలేనని చెబుతున్నారు. యూవీ తీసిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడుతున్నా, వరసబెట్టి సినిమాలు తీస్తుండడంతో అధికారులకు అనుమానం వచ్చిందని చెబున్నారు. ప్లాప్ సినిమాల కంపెనీ వందల కోట్లను ఎక్కడి నుంచి ఎలా తీసుకొస్తోందనే అనుమానాలతోనే దాడి జరిగినట్లు సమాచారం. ఐటీ దాడులపై యూవీ కంపెనీ ఇంతవరకు స్పందనించలేదు. ప్రభాస్‌కు దాయాది అయిన ప్రమోద్ ఉప్పలపాటి, మిత్రులైన వంశీకృష్ణారెడ్డి, విక్రమ్ కృష్ణారెడ్డిలు 2013లో యూవీ క్రియేషన్స్ ప్రారంభించారు.