ఆన్ లైన్ కొనుగోళ్లు చేసేవారికి షాకింగ్ న్యూస్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆన్ లైన్ కొనుగోళ్లు చేసేవారికి షాకింగ్ న్యూస్..!

June 28, 2017

దేశమంతా ఒకే పన్ను జులై ఫస్టు నుంచి అమల్లోకి వస్తుంది. పన్ను అటుపోట్లు తప్పవు.మరి ఆన్ లైన్ కొనుగోళ్లపై ఎఫెక్ట్ ఉంటుందా..? కస్టమర్లకు లాభామా నష్టమా.. ?వేస్తే ఎంతశాతం పన్ను వేస్తారు..?

స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఆన్ లైన్ షాపింగ్ అమ్మకాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు ఇప్పుడు పన్నును వసూలు చేయడం లేదు. జీఎస్‌టీ అమల్లోకి వస్తే అమ్మకందారుడికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో 1శాతం పన్నును వసూలు చేస్తాయి. ఆన్‌లైన్‌ లో వస్తువులు కొంటే కొంచెం ఎక్కుగా చెల్లించక తప్పదు. ప్రస్తుతానికి దీనిని వాయిదా వేశారు. భవిష్యత్‌లో ఎప్పుడైనా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. జీఎస్‌టీ అమలు తర్వాత ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువులు వేగంగా కస్టమర్ దగ్గరకు చేరతాయి. ప్రస్తుతం ప్రతీ రాష్ట్రానికో స్టేట్‌మెంట్‌ తయారు చేయాల్సి వస్తోంది. జులై 1 తర్వాత ఈ పని ఉండదు.

కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అదనపు పన్ను చెల్లించాల్సి రావడంతో భవిష్యత్‌లో ఇది సాధ్యం కాకపోవచ్చు. వస్తువు ధరపై విధించే పన్నును దానిని సప్లయ్‌ చేసే సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక నుంచి అన్ని సందర్భాల్లోనూ తగ్గింపు ధరలను ప్రకటించడం కుదరదు. జీఎస్‌టీ అమలులోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎదురయ్యే సమస్య వస్తువును తిరిగి ఇచ్చేయడం, రద్దు చేసుకోవడం. ఒక వస్తువును కొనుగోలు చేసిన తర్వాత తిరిగి ఇచ్చేయాలని భావించినా, లేదా రద్దు చేసుకున్నా ఈ-కామర్స్‌ కంపెనీలు సుమారు 18శాతం వరకూ ఛార్జీలను వసూలు చేయబోతున్నాయి. మొత్తానికి ఇప్పటికప్పుడు ఎఫెక్ట్ లేకున్నా..భవిష్యత్ లో ఎంతోకొంత భారమే.