ఓహో..పెట్రోలు, మద్యాన్ని అందుకే జీఎస్టీలోకి తెలేదంటా..! - MicTv.in - Telugu News
mictv telugu

ఓహో..పెట్రోలు, మద్యాన్ని అందుకే జీఎస్టీలోకి తెలేదంటా..!

July 8, 2017

పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదు..తెస్తే లీటర్ 40 రూపాయలు అయ్యేది కదా..ఇలా ఎందుకు ఆలోచించలేదు. అని సోషల్ మీడియాలో , బయట జనం చర్చోపచర్చలు చేశారు. పెట్రోలు, మద్యాన్ని జీఎస్టీలోకి తీసుకొస్తే ఇంత శాతమే పన్ను పడుతుందని లెక్కలు విడమరిచి చెప్పారు. కానీ పాలకులు సోషల్ మీడియాలో వీటిని చూసినా పట్టించుకోలేదు.ఎందుకంటే..

దేశంలో అన్నింటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు.ఒక్క పెట్రోలు, మద్యాన్ని తప్ప. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం వీటిని నుంచే వస్తోంది. అందుకే ఎప్పుడు జీఎస్టీ సమావేశాలు పెట్టినా…అమల్లోకి తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాల ఫోకస్ ఈ రెండింటిపైనే ఉండేది. వీటి ధ్వాసలో పడి మిగతా వాటిని వదిలేశాయి. ఇలా కేంద్రం లెక్కలు..కేంద్రానికి..రాష్ట్రం లెక్కలు రాష్ట్రాలకు ఉన్నాయి. సో జనాన్నికి మంచి జరిగే ఆ విషయాలను గాలికొదిలేశారు. ఆ పని చేస్తే తమకు నష్టం వస్తుందనే ఆలోచించరు తప్ప జనం గురించి పట్టించుకోలేదు.

పెట్రోలు, మద్యంపై పన్ను విధించే అంశాన్ని తమకు వదిలేయాలంటూ రాష్ట్రాలు కోరాయని, అందుకే జీఎస్టీ జాబితాలో ఈ రెండు ఉత్పత్తులను చేర్చలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ సెలవిచ్చారు. జీఎస్టీ పరంగా పన్నులు విధించే అంశాన్ని 29రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్రం, సభ్యులుగా ఏర్పాటయిన జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాజ్యంగపరంగా ఏర్పాటైన ఈ కమిటీ ఎప్పుడూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోదని ఆమె చెప్పారు.

నిజమే ఏక పక్ష నిర్ణయాలు ఏం తీసుకోలేదు..రెండు పక్షాల నిర్ణయమే తీసుకున్నారు ప్రజా పక్షాన్ని వదిలేసి.ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలంటే ఇలాగే ఉంటాయి మరి. ఎంతసేపు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడం తప్ప..మంచి చేద్దామన్న సోయి ఉండదు. సర్కారీ కొలువుల్లో ఎవరున్నా ఇంతే…