నవ్వితే ఇవ్వాలే నవ్వండి...తింటే ఇవ్వాలే తినండి..! - MicTv.in - Telugu News
mictv telugu

నవ్వితే ఇవ్వాలే నవ్వండి…తింటే ఇవ్వాలే తినండి..!

June 30, 2017

నవ్వితే ఇవ్వాలే నవ్వండి…తింటే స్టార్ హోటల్లో ఇవ్వాలే తినండి..జోక్స్ పంపేది ఉంటే ఈ రోజు రేపే పంపండి. జులై ఒకటి నుంచి పంపితే మీరు పంపిన జోక్స్ చదివి నవ్వుతే GST పరిధిలోకి వస్తుంది, అప్పుడు వినోదాపు పన్ను 28% ట్యాక్స్ కట్టవలసి వస్తుంది. తినే తిండిపై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న జోక్.

నిజమే… అచ్చే దిన్..అచ్చేదిన్.. అంటే ఏంటో అనుకున్నాం.. నవ్వులపై పన్ను…హోటల్ కెళ్లి తినే తిండిపై ట్యాక్స్ కట్టాలి. పెట్రోల్ , డీజీల్ పై 33 శాతం పన్ను భారం మోయాల్సిందే. ఏ దేశాల్లోనూ వేయని పన్నులు భరించాలి.ఇలా అన్ని భరిస్తూ అణిగిమణిగి ఉండటమే అచ్చేదిన్. అందుకే జీఎస్టీకి రాష్ట్రాలు జిందాబాద్ అన్నట్టు ఉన్నాయి

బీజేపీ గొప్పగా చెప్పుకుంటున్నట్లు సామాన్యులకు జీఎస్టీ అమలతో పెద్దగా మేలు ఏమి జరుగదు. మిడిల్ క్లాస్ వాళ్లకు నెలకు ఆరేడు వందలు మిగులుతాయని జైట్లీ లెక్కలేశారుగానీ బొక్క పడుకుంటే చాలు. ట్రాన్స్‌పోర్టుకి కీలకమైన పెట్రోల్, డీజిల్ వంటి చమురు ఉత్పత్తులపై (33శాతం) పన్నును రాష్ట్రాలకే వదిలేయడంతో సామాన్యుడి నెత్తి మీద టోపీ పెట్టారు. నిత్యావసరాల వస్తువులపై తూతూమంత్రంగా సడలింపు ఇచ్చి కేంద్రం బిస్కట్లు వేస్తోంది.

ప్రపంచమంతా 18%లోపే..గ్రేట్ ఇండియాలో 28%…!

ప్రపంచ వ్యాప్తంగా జీఎస్టీ పన్నులు పరిశీలిస్తే అమెరికా, చైనా, రష్యా, జపాన్, సింగపూర్ లాంటి దేశాలతో పోలిస్తే ఏ దేశాల్లోనూ వేయని పన్నులు అధికంగా (28శాతం)ఇక్కడే వేస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రపంచవ్యాప్తంగావున్న GST రేట్స్‌..

అమెరికా       – 7.5 %
చైనా              – 17 %
జపాన్           – 8 %
రష్యా             – 18%
ఆస్ర్టేలియా – 10%
బహ్రెన్          -5%
కెనడా            -15%
కొరియా          -10%
కువైట్            -5%
మలేషియా    -6%
మారిషస్       -15%  
మెక్సికో          -16%
మయిన్మార్   -3%
న్యూజిలాండ్ -15%
పిలిప్పీన్స్   -12%
సింగపూర్ — -7%
సౌతాఫ్రికా    -14%
థాయిలాండ్ -7%
యుఏఈ        -5%
వియత్నాం   -10%
జింబాబ్వే     -15%
ఇండియా     – 28%