ఒక్క జామకాయ రూ. 100.. లెక్కచెయ్యని జనం…  - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క జామకాయ రూ. 100.. లెక్కచెయ్యని జనం… 

December 2, 2019

జామకాయల సీజన్ వచ్చిందంటే చాలు ఎంతో మంది అమితంగా ఇష్టపడుతుంటారు. ఎన్నో రకాల విటమిన్స్ ఉంటే ఈ పళ్లకు మార్కెట్లో గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. కానీ కశ్మీర్ యాపిల్ కంటే ధరలో మించిపోయింది జామకాయ. కేవలం ఒకే ఒక్క జామ ధర రూ. 100కు అమ్ముడవుతోంది. ఈ ధర విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. హర్యానాలోని జీంద్‌లోని కందేలా గ్రామంలో ఓ రైతు పండించిన జామకు ఈ ధర పలుకుతోంది. అయితే ఇంతగా ధర పలకడం వెనక ఓ కారణం లేకపోలేదు. 

 Guava Price.

థాయ్‌లాండ్ రకానికి చెందిన జామను సునీల్ రెండేళ్లుగా సాగు చేస్తున్నాడు. ఒకే ఒక్క జామకాయ సుమారు 800 గ్రాములు ఉంటుంది. అంతే కాకుండా రుచిలోనూ,పోషకాల్లోనూ మిగితా వాటి కంటే ఎక్కువగా రుచి ఉంటుంది. ఈ విషయం తెలిసిన జనాలు వాటిని కొనేందుకు ఎగబడుతున్నారు. డబ్బులు పోయినా పర్వాలేదు ఒకసారి ఆ రుచి ఏంటో చూసేద్దామని తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఈ విషయం ఆనోటా ఈ నోటా వైరల్‌గా మారింది. 

కాగా రైతు సునిల్ కండేలా వేసినన పంట కేవలం ఒక సంవత్సరంలోనే అద్భుతమైన దిగుబడి వచ్చింది. వాటిని మార్కెట్‌కు తరలించిన ఆ రైతు దానికి ఉన్న గొప్పతనం చెప్పడంతో వీటికి డిమాండ్ పెరిగింది. దీనికి తోడు వీటిని ఆర్గానిక్ విధానంలో పండించడంతో జనం ఎగబడుతున్నారు. ఒక్కొక్కరు సుమారు 10 కిలోల వరకు  కొంటున్నారని రైతు చెబుతున్నాడు.