గుడివాడ ఎమ్మెల్యే కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇన్నిరోజులు టీడీపీ అధినేత చంద్రబాబును వెన్నుపోటు దారునిగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని…ఇఫ్పుడు మరో సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. అంతేకాదు ఈ విషయంపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామన్నారు నాని. నందమూరి తారక రామారావు రాష్ట్ర సంపద, ఆయన ఎలా మరణించారో రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన మరణంపై మిస్టరీ వీడాలంటూ కొడాలి నాని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.
హరికృష్ణ డిమాండ్ చేసినా ఎన్టీఆర్ మృతిపై బాబు ఎందుకు విచారణ చేయలేదు ?#KodaliNani #PsychoCBN pic.twitter.com/OuRhHg33C4
— YSR Congress Party (@YSRCParty) February 4, 2023
నారా లోకేష్ పాదయాత్రలో చేసిన విమర్శల స్పందించిన కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మరణించినప్పుడు హరికృష్ణ మంత్రిగా ఉన్నారు. హరికృష్ణ ఎంత డిమాండ్ చేసినా..ముఖ్యమంత్రిగా చంద్రబాబు సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత చంద్రబాబు తనకు అనుకూలంగా విషయాలను మార్చుకున్నారని కొడాలి నాని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి :
జూ.ఎన్టీఆర్‌తో లాభం లేదు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
ఐదుసార్లు నమాజ్ చేసి పాపాలు చేస్తుంటారు.. రామ్‌దేవ్