Gudivada mla kodali nani slams janasena chief pawan kalyan
mictv telugu

ఆ చెప్పుతో నువ్వే కొట్టుకో, బాబునూ కొట్టు.. నాని

October 20, 2022

Gudivada mla kodali nani slams janasena chief pawan kalyan

ఏపీ రాజకీయ నాయకులు బూతుల్లో, విమర్శల్లో మునిగి తేలుతున్నారు. ‘కొడకల్లారా తోలుతీస్తా,’ ‘ఇలా పెళ్లిళ్లు చేసుకుంటూ పోతే మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏమిటి?’, ‘ఏం పీక్కుంటావో పీక్కో,’ వంటి చక్కని మర్యాదకరమైన భాషల్లో ఘాటుగా తిట్టుకుంటున్నారు. ఇలాంటి మాటల్లో ఒక ఆకు ఎక్కువే చదివిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ తెరపైకి వచ్చారు. తన మూడు పెళ్లిళ్లపై విమర్శిస్తున్న వైసీపీ నేతను పవన్ కల్యాణ్ ‘చెప్పుతో కొడతా, తోలు తీస్తా,’ అని తిట్టిన తిట్లపై నాని తనదైన శైలిలో స్పందించాడు.

‘‘నీ చెప్పును జాగ్రత్తగా పెట్టుకో. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు ఆ చెప్పుతో నిన్ను నువ్వే కొట్టుకో. నీ దుస్థితికి కారణమైన మీ చంద్రబాబు నాయుడను అదే చెప్పుతో కొట్టు.. నువ్వు ఇకనైనా మారు. బ్రహ్మానందంలా మాట్లాడకు. ” అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ కల్యాణేనని విమర్శించారు. జనసేన పని చంద్రబాబు ఊడిగం చెయ్యడమేనని అన్నారు. వందమంది పీకేలు వచ్చిన జగన్ కాలిగోటుకు కూడా సరిరానన్నారు. పవన్ కాపుల సంక్షేమం కోసం కాకుండా, జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపడానికే, చంద్రబాబు చెప్పినట్టు చిల్లర వేషాలు వేస్తున్నాడని నాని మండిపడ్డారు.