వైసీపీ ఎమ్మెల్యే కారుకు యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ ఎమ్మెల్యే కారుకు యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం

October 13, 2020

jbghfg

వైసీపీ ఎమ్మెల్యేకు భారీ కారు ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. చెన్నై నుంచి తన నివాసానికి వెళ్తుండగా నాయుడుపేట వద్ద ఇది చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. గన్‌మెన్, డ్రైవర్‌కు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

సోమవారం రాత్రి గూడురుకు ఎమ్మెల్యే తన కారులో బయలుదేరారు. ముందు ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారంతా గాయాలపాలయ్యారు. వాహనం ముందు భాగం ధ్వంసమైంది. ఆ తర్వాత ఎమ్మెల్యే మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కారు వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.  ప్రమాద విషయం తెలియగానే ఆయన అనుచరులు పరిస్థితిని ఆరా తీస్తున్నారు.