200 కాదు 170 మాత్రమే.. అయోధ్య అతిథుల సంఖ్య కుదింపు - MicTv.in - Telugu News
mictv telugu

200 కాదు 170 మాత్రమే.. అయోధ్య అతిథుల సంఖ్య కుదింపు

August 2, 2020

Guest List Decrease Ayodhya Bhoomi Pujan .

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీన భూమి పూజ ఉండటంతో కరోనా నేపథ్యంలో కార్యక్రమాన్ని సాధాసీదాగా నిర్వహించనున్నారు. అతికొద్ధి మంది అతిథులకు మాత్రమే ఆహ్వానాలు పంపుతున్నారు. ఇంతకు ముందు వరకు 200 మందిని రప్పించాలని అనుకున్నారు. కానీ దాన్ని 170 మందికే కుదిస్తున్నట్టు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ప్రధాని మోదీ సహా అతి తక్కువ మంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. 

రాజకీయ ప్రముఖులు, 50 మంది సాధు సంతులుఇతర ప్రముఖులు మాత్రమే దీనికి హాజరుకానున్నారు. అయితే సాధు సంతుల జాబితాలో మోరారీ బాపు, శ్రీశ్రీశ్రీ రవి శంకర్ పేర్లు ప్రస్తుతానికి చేర్చలేదు. కాగా, ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ ఆనందీబేన్ పాటిల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్టు అధ్యక్షులు నృత్య గోపాల్ దాస్‌, ఆరెస్సెస్ అగ్రనేతలు ఇతర ప్రముఖుల సమక్ష్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధానితో పాటు కేవలం ఐదు మంది మాత్రమే వేధికను పంచుకోనున్నారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. కీలక ఘట్టం కావడంతో భద్రతా చర్యలు కూడా పటిష్టం చేశారు.