ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్టులుగా - స్టార్ హీరోలు - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్టులుగా – స్టార్ హీరోలు

December 22, 2021

02

తెలుగు చిత్రసీమ పరిశ్రమలో దర్శకుడు రాజమౌళి తీసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా చిత్రీకరణ సమయం రెండు, మూడు సంవత్సరాలు పట్టిన, ఫలితం మాత్రం అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చేలా ఉంటుందనేది అక్షరాల సత్యం. అయితే, ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో, ఇద్దరు స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాగా చిత్రీకరణ పూర్తి చేసుకొని, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ముంబైలో ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీ సెట్‌ను వేస్తున్నారు.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్ తదితరులు హాజరుకానున్నారు. అయితే, టాలీవుడ్ నుంచి ఏ స్టార్ హీరోలు ఈవెంట్‌లో పాల్గొనున్నారు అనే అంశంపై గతకొన్ని రోజులుగా చిత్రసీమలో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు చిత్ర బృంద చెక్ పెట్టింది. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మెగస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణలు హాజరుకానున్నారని వెల్లడించింది. దీంతో ప్రీరిలీజ్ ఈవెంట్ ఏ రేంజ్‌లో జరగబోతుందోనని ఉహించవచ్చు. సినిమా విడుదలకు ముందే రికార్డులను బద్దలు కొడుతుందని ఇటు చిత్రసీమ దర్శకులు,నిర్మాతలు, ఇటు జూనియర్ ఎన్టీర్ అభిమానులు, రాంచరణ్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతే విధంగా ఈ సినిమాను వీక్షించటం కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.