సినిమాలు చూస్తూ గిన్నీస్ రికార్డు.. మనమూ ట్రై చేయొచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాలు చూస్తూ గిన్నీస్ రికార్డు.. మనమూ ట్రై చేయొచ్చు

April 18, 2022

cin

మనలో చాలా మందికి గిన్నీసు రికార్డు సాధించాలంటే ఏదో ప్రత్యేక టాలెంటు ఉంటేనే సాధ్యమవుతుందనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. కానీ, కొన్ని రికార్డులను చూస్తే సాధారణ పౌరులు కూడా సాధించవచ్చనేలా ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే రికార్డు కూడా అలాంటిదే. కేవలం సినిమాలను చూస్తూ ఓ వ్యక్తి గిన్నిస్ రికార్డును తన పేర లిఖించుకున్నాడు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రామిరో అలానిస్ అనే వ్యక్తికి సినిమాలు చూడడం అంటే పిచ్చి. ఇతను ‘స్పైడర్ మ్యాన్.. నోవే హోమ్ అనే సినిమాను మూడు నెలల్లో 292 సార్లు చూసిన ఘనతను సాధించాడు. గంటల్లో లెక్కిస్తే అన్ని సార్లు సినిమా రన్ టైం 720 గంటలు. రోజుల్లో లెక్కిస్తే 30 రోజులు. గతేడాది డిసెంబర్ 16 నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు ఈ సినిమాను చూశాడు. ఈ క్రమంలో గతంలో తన పేరిటే ఉన్న 191 సార్లు సినిమాను చూసిన రికార్డును తిరగరాశాడు. దీనికోసం అతడు సినిమాను థియేటర్లో ఆడించడం ఆపేంతవరకు చూశాడు. రోజుకు కనీసం ఐదు సార్లు చూసేవాడినంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి.. మనలో సినిమాలు చూసే అలవాటు చాలా మందికి ఉంది. మరి ఎవరైనా ప్రయత్నిస్తారా? కామెంటులో తెలియజేయండి