పుచ్చకాయ గిన్నీస్ రికార్డు.. కేజీ రూ. 4 లక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

పుచ్చకాయ గిన్నీస్ రికార్డు.. కేజీ రూ. 4 లక్షలు

April 20, 2022

puchaa

వేసవి వచ్చిందంటే చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే పుచ్చకాయ ధర మన వద్ద ఏ సీజన్‌లోనైనా మహా అయితే రూ. 100 ఉంటుంది. కానీ, జపాన్‌లో మాత్రమే పండే ‘డెన్సుకే’ రకం పుచ్చకాయ ధర రూ. 19 వేల నుంచి రూ. 4 లక్షల వరకు పలుకుతుందంట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పుచ్చకాయ ఇది. దీని డిమాండ్ దృష్ట్యా వేలం పాట కూడా నిర్వహిస్తారు జపాన్ రైతులు. ఫుట్‌బాల్ ఆకారంలో నల్లగా ఉండే ఈ పుచ్చకాయ రుచిగా, తీయగా ఉండడంతోపాటు పోషకవిలువలు చాలా ఉంటాయని కొనుగోలు దారులు చెప్తున్నారు. చాలా రిస్కుతో కూడిన ఈ పంట పండించాలంటే ప్రత్యేక వాతావరణం ఉండాలంట. అందుకే ఏటా కొంతవరకే పండించగలుగుతారంట రైతులు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే విదేశీయులు కూడా ఈ పుచ్చకాయలను కొనడానికి ఆసక్తి చూపుతారని జపనీయులు అభిప్రాయపడుతున్నారు.