పందేంటి? రికార్డు సాధించడమేంటి? అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే. హంగేరీకి చెందిన ఒక గినియా పంది 30 సెకండ్లలో నాలుగు బాస్కెట్ బాల్ స్లామ్ డంక్స్ వేసి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో గిన్నీస్ రికార్డు సాధించింది.
ఈ వీడియోను గిన్నీస్ రికార్డు వారు అధికారికంగా గుర్తించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నోటితో బంతిని తీయడం బాస్కెట్లో వేయడం తర్వాత అదే సీను రిపీట్ చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మీరూ ఓ లుక్కేయండి.