గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన 'జెర్సీ'.. వీడియో ఇదిగో - MicTv.in - Telugu News
mictv telugu

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ‘జెర్సీ’.. వీడియో ఇదిగో

May 30, 2022

ఐపీఎల్ 15వ సీజన్ (2022) ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తమ ఆటపాటలతో అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ క్రమంలో అతిపెద్ద క్రికెట్ జెర్సీ (పైన ధరించే వస్త్రం, టీషర్ట్)ని గ్రౌండ్‌లో ప్రదర్శించారు. మాజీ క్రికెటర్ రవిశాస్త్రి మాట్లాడుతూ..”ఈ జెర్సీ ప్రపంచంలోనే అతిపెద్ద జెర్సీ. 66 X 44 మీటర్ల సైజుతో దీనిని తయారు చేశారు. అందుకే అతిపెద్ద క్రికెట్ జెర్సీగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ జెర్సీలో పది జట్ల లోగోలను ప్రింట్‌ చేసి వేశారు. 15వ సీజన్‌ను ప్రతిఫలిస్తూ జెర్సీపై 15వ నంబర్ వేశారు” అని ఆయన అన్నారు.

 

మరోపక్క ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ (2022) ఆదివారంతో ముగిసిపోయిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో పది జట్లు కప్పు కోసం పోటాపోటీగా యుద్ధం చేశాయి. క్రికెట్ అభిమానులు ఈసారి ఫలానా ఫలానా జట్లు ఫైనల్స్‌కి వస్తాయని భారీగా అంచనాలు వేసుకున్నప్పటికి, గుజరాత్ జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుందని ముందుగా ఎవరు ఊహించలేదు. ఎలాంటి అంచనాల్లేకుండా గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన.. గుజరాత్ జట్టు మొదటి నుంచి చివరి మ్యాచ్ వరకు అద్భుత ఆటతీరును కనబరిచి కప్పును ఎగరేసుకుపోయింది. ఈ క్రమంలో మ్యాచ్‌కు ముందు గ్రౌండ్‌లో ప్రదర్శించిన అతిపెద్ద క్రికెట్ జెర్సీ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంతో లక్షల మంది ప్రేక్షకులు కేకలు, ఈలలు వేస్తూ, ఎంజాయ్ చేశారు..