డిప్స్ కొట్టుట్లో మొనగాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

డిప్స్ కొట్టుట్లో మొనగాడు..!

July 16, 2017

వయసులో ఉన్న వాళ్లను  దమ్మచ్చేదాక  కంటిన్యూగ డిప్స్ కొట్టమంటే ఎన్ని కొడ్తరు,మహా అయితే  ఓ వంద గొడ్తరు కావచ్చు,ఆ తర్వాత  అమ్మో  నాతోని గాదు అని  అట్లనే బొక్క బోర్ల వడ్తరు,కనీ ఆస్ట్రేలియాకు చెందిన కార్లటన్ విలియమ్స్ అనే టాయ్న  ఎన్ని గొడ్తడో ఎర్కేనా, గంటకు 2500 బస్కీలు తీస్తడట,మరి ఈయ్నకు  దమ్ము రాదా..?కాళ్లు శెయ్యిలు గుంజవా అంటే  ఏమో మరి…ఎక్కో బస్కీలు దీశ్న  వ్యక్తిగా గిన్నిస్ బుక్కులకు గుడ ఎక్కిండు, రొండేన్లకింద గంటల 2220 బస్కీలు దీశి సూశినోళ్లందర్ని  పర్శాన్ జేశిండట,ఇప్పుడేమో ఆయ్న  రికార్డును ఆయనే బద్దులు కొట్టుకుండన్నట్టు.మల్లా ఆయ్న వయసు ఎంత అన్కుంటున్రు…ఉత్త 52 ఏండ్లే..ఓర్ని  వయసు హాఫ్ సెంచరీ దాటినా గుడ గన్ని డిప్స్ లు కొట్టిడంటే నమ్మబుద్దైతలేదు కదా,ఏం జేస్తం కొందరు సూస్తె మామూలు మన్షులెక్కనే కనవడ్తరు గనీ వాళ్లు జేశే అద్బుతాలు గిట్లనే ఉంటయ్.