Guinness World Records of couple who birthed nonuplet     
mictv telugu

తొమ్మిది మంది పిల్లలతో గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి..

December 22, 2022

మాలిలోని టింబక్టుకు చెందిన హలీమా గర్భం దాల్చింది. ముందుగా హలీమా, సిస్సే.. ఆ దంపతులు తమకు ఏడుగురు పిల్లలు పుడుతున్నారనుకున్నారు. కానీ తొమ్మిది మంది పుట్టారు. ఇప్పుడా పిల్లలు గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు ఒకే కాన్పులో పుట్టడం చూశాం. కానీ హలీమాకు ఏడుగురు పిల్లలు అని చెప్పారు. అయితే వీరు మొరాకో వెళ్లేవరకు ఇదే భ్రమలో ఉన్నారు. అక్కడకి వెళ్లాక సర్జరీ సమయంలో ఏడుగురు కాదు తొమ్మిది మంది పిల్లలు పుడతారని తెలిసింది. ఇలా తొమ్మిది మంది అంటే నాన్ ప్లెట్ అని పిలుస్తారు. ఒకవేళ ఇలా పుట్టినా అందులో చనిపోయే పిల్లలు ఉంటారు. కానీ హలీమా పిల్లలు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు.

అందరూ ఆరోగ్యంగా..
మొదట మాలిలోని వైద్యులు తల్లి హలీమా ఏడుగురు పిల్లలను మోస్తుందని భావించారు. అయితే మాలియన్ ప్రభుత్వం ఆమెను మొరాకోలోని స్పెషలిస్ట్ క్లినిక్ కి తరలించిన తర్వాత మరో ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలుసుకున్నారు. ఒక డెలివరీలో ఐదుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు పుట్టారు. వీరి వీడియోని గిన్నీస్ రికార్డ్ వాళ్లు షేర్ చేయడంతో ప్రపంచమంతా తెలిసింది. ఐదుగురు ఆడపిల్లల పేర్లు.. ఆడమా, ఔమౌ, హవా, కడిడియా, ఫాటమౌ అని, నలుగురు మగపిల్లలకి.. ఔమర్, ఎల్హాద్జీ, బాహ్, మొహమ్మద్ VI అని పేరు పెట్టుకున్నారు. వీరు నెలలు నిండకుండానే అంటే 30వారాలల్లోనే పుట్టారు. 4 మే 2021న సిజేరియన్ చేసి ఈ పిల్లలను తీశారు. వీరు పుట్టి సంవత్సరం దాటింది. అందరూ ఆరోగ్యంగా ఉండడంతో గిన్నీస్ రికార్డు వాళ్లు పిలిచి మరీ వారి పేర్లను నమోదు చేశారు. మాలి ఆరోగ్యమంత్రి డిమినాటౌ సంగరే కూడా ఈ పిల్లలు మొరాకో నుంచి ఇంటికి తిరిగి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో వీరి కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

అల్లా దీవెన..
‘అసలు పిల్లలు పుడతారో లేదో అని భావించాం. కానీ ముందు ఏడుగురు పుడుతున్నారనే వార్త మా ఆనందానికి అవధుల్లేకుండా చేసింది. కానీ తొమ్మిది మంది పుట్టారు. ఇదంతా అల్లా దీవెన అనుకుంటున్నాం. సర్జరీ సమయంలో మాకు ఈ విషయం తెలిసింది. వారిని పెంచడం ఇప్పుడు మా ముందున్న పెద్ద టాస్క్. అది కూడా కచ్చితంగా పూర్తి చేసి అందరికీ మంచి భవిష్యత్తునిస్తాం’ అంటున్నాడు హలీమా భర్త సిస్సే.