గుజరాత్‌ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 40 మంది గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

గుజరాత్‌ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 40 మంది గాయాలు

June 3, 2020

 

chemical factory.

ఒక్క విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉండగా మరోపక్క దేశం నలుమూలాలా ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  గుజరాత్‌లోని బరూచ్ జిల్ల3 దహేజ్ పారిశ్రామికవాడలో ఈ రోజు మధ్యాహ్నం ఓ ఆగ్రోకెమికల్ ఫ్యాక్టరీలోని కెమికల్ బాయిలర్ భారీ శబ్దంతో పేలిపోయింది. భారీ ఎత్తున మంటలు లేచి దట్టమైన పొగ అలముకుంది. 

పేలుడులో 40 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. 10 అగ్నిమాపక ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నా, అదుపులోకి రావడం లేదు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించామని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫ్యాక్టరీ నుంచి ప్రమాదకర విష రసాయనాలు వెలువడ్డంతో చుట్టుపక్క గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.