గుర్తెరిగి వాత పెట్టారు - MicTv.in - Telugu News
mictv telugu

గుర్తెరిగి వాత పెట్టారు

June 15, 2017

ఓటర్లు లీడర్లకెప్పుడూ లోకువే.. కేవలం ఎన్నికల సమయంలో తప్ప ఇది మన ఇండియాలో గత 70 ఏండ్లుగా వస్తున్న ఆచారం. మాయ మాటలతో ఓటర్లను మభ్యపెట్టి వాళ్ళ నుండి ఓట్లు దండుకోవడం ఇక్కడి రాజనీతి. ఈ దేశం రివాజును ఆ ప్రజలు మార్చేశారు. ఓట్లు నోట్టకు అమ్ముడుపోతున్న ప్రస్తుత సన్నివేశాన్ని తిప్పి రాశారు అక్కడి ప్రజలు. అసలేం జరిగిందో తెలుసుకోవాలనుంది కదా.. గుజరాత్ రాష్ట్రంలోని దంగ్ జిల్లా నవగాంవ్ గ్రామ ప్రజలు ఈ దేశానికే ఓటరు విలువేంటో చాటి చెప్పారు. పదమూడు వందల పూరిగుడిసెలుండే ఆ గ్రామానికొచ్చిన నాయకులు అప్పటి ఎలక్షన్లప్పుడు అందరికీ ఇళ్ళు కట్టిస్తామని వాదా చేసారు. వీళ్ళు ఇంటి ఆశకు ఓట్లేసి ఆ నాయకుణ్ని గెలిపించారు. ఆ తర్వాత వారు వాగ్దానాన్ని గంగలో పారబోసేసారు. పాపం వాళ్ల జిందగీ ఆ పూరి గుడిసెల్లోనే వాన ఉరుపులు, చలి కొరుకుళ్ళు, వేసవి తాపాల మధ్యే గడిచిపోయింది.

కట్ చేస్తే.. ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సదరు నాయకులు ఓట్లు అడగడానికొచ్చిన వాళ్ళకు ఆ వూరి ప్రజలిచ్చిన షాక్ గుజరాత్ సీఎం విజయా బాయి రూపానీకే తల తిరిగేలా చేసింది ? ఎన్నికలను బైకాట్ చేసేసారు. మళ్ళీ మీ అబద్ధపు వాగ్దానాలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేమని చెప్పారు. మాకు ఇళ్ళు కట్టిస్తేనే మా వూళ్ళో ఓట్లు అప్పటివరకు ఓట్లు లేవు గీట్లు లేవని ఖరాఖండిగా చెప్పేసారు. ఇళ్ళు లేని మాకు ఇళ్ళు కట్టిస్తామని మాట దాటేసారు మా ఓట్లతో గెలిచి మీరు దర్జాగా బతుకుతుంటే మేమిలా గుడిసెల్లోన వుండిపోవాలా అని కడిగి పారేసారు.

నిజమే కదా వాళ్లలా మనం కూడా నాయకులను సూటిగా నిలదీసి వాళ్ళకు ఓటెయ్యకపోతే దెబ్బకు తిక్క కుదురుతుంది కదా.. గొప్ప ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటాం కానీ ప్రజలను బకరాలను చేసి ఆడుకునే రాజకీయంలో మనం మగ్గుతున్నామని ఎప్పటికి రియలైజ్ అవుతారో జనమందరూ ?
ఇక్కడ ఓటరేమనుకుంటాడు నేను ఫలానా లీడర్ కు ఓటేస్తేనే నేను నా నాకుంటుంబం సేఫ్ గా వుంటామనే భయంలో వుండేస్తారు. కానీ ఇక్కడ ఓటర్లందరు తెల్సుకోవాల్సిన గొప్ప నిజం ఏంటంటే ఓటరే నాయకుడి శక్తి – ఓటరుకి తన ఓటే మహా శక్తి ! ఈ నిజాన్ని నాయకుడెప్పుడో తెలుసుకొని చాలా తెలివిగా ప్రజలను బురిడీ కొట్టించి మసలుకుంటున్నాడు. కానీ ప్రజలే ఇంకా తమ చేతుల్లో వున్న వజ్రాయుధాన్ని గురించి తెలుసుకోలేకపోతున్నారు ??