Gujarat assembly elections exit polls
mictv telugu

గుజరాత్‌లో మళ్లీ కమలమే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవీ

December 5, 2022

దాదాపు మూడు దశబ్దాలుగా గుజరాత్‌ను అప్రతిహతంగా ఏలుతున్న బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముంది. సోమవారం రెండో, చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కమలానికే పట్టం గట్టాయి. సత్తా చూపుతుందనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ హవా ఏమీ ఉండదని చెప్పాయి. ఎప్పట్లాగే కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని ఆప్ మూడో స్థానానికి పరిమతమవుతుందని తేల్చాయి.

పీపుల్స్ పల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 182 సీట్లకు గాను బీజేపీకి 125 నుంచి 143 స్థానాలు దక్కొచ్చు. కాంగ్రెస్ పార్టీకి 30 నుంచి 48లోపు, ఆప్ పార్టీకి 3 నుంచి 7 సీట్లు రావొచ్చు.జన్ కీ బాత్ పోల్స్ ప్రకారం బీజేపీకి 117 నుంచి 140 మధ్య, కాంగ్రెస్ పార్టీకి 35 నుంచి 51 మధ్య, ఆప్ పార్టీకి 6 నుంచి 13 మధ్య రావొచ్చు. పీ మార్క్, టైమ్స్ నౌ తదితర సర్వేలన్నీ దాదాపు ఇవే అంచనాలే వేశాయి. గుజరాత్ మోదీ సొంత రాష్ట్రం కావడం, వచ్చే పార్లమెంటు ఎన్నికలకు కీలకం కావడంతో కమలదళం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.