Gujarat assembly elections schedule announced by the Election Commission.
mictv telugu

గుజరాత్‌లో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల

November 3, 2022

Gujarat assembly elections schedule announced by the Election Commission.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే నెల రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌. తొలి విడత పోలింగ్ కోసం ఈ నెల 5న, రెండో విడత కోసం ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 51 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం గుజరాత్ లో 4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో 4.61 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందారని మీడియా సమావేశంలో సీఈసీ రాజ్ కుమార్ చెప్పారు.

ఈసారి జరగనున్నఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటేసేలా చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపారు. ఓట్ల లెక్కింపును డిసెంబర్ 8న చేపడతామని చెప్పారు. ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ లో కూడా వచ్చే నెలలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. డిసెంబర్ 10వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. గత 25 ఏళ్లుగా బీజేపీ గుజరాత్‌ను పాలిస్తోంది. ఈసారి కూడా తామే గెలుస్తామని షెడ్యూల్ విడుదల అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశాడు.