ఆర్టీసీ బస్సులకు కాషాయరంగు.. ఎన్నికల ముందు బీజేపీ స్టంట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ బస్సులకు కాషాయరంగు.. ఎన్నికల ముందు బీజేపీ స్టంట్

June 16, 2022

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్ రాష్ట్రంలో ఆర్టీసీ వివాదాస్సద నిర్ణయం తీసుకుంది. తన పరిధిలో ఉన్న కొన్ని బస్సులకు కాషాయ రంగు పూయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. 200 బస్సులు, 300 స్లీపర్ బస్సులు, 500 డీలక్స్ బస్సులకు కాషాయ రంగు వేస్తున్నామని, దీనికి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదని సంస్థ అధికారి దేశాయ్ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. బీజేపీ హిందూత్వ కార్డును మరోసారి వాడుతుందని ఆరోపించింది. ప్రధాని మోదీ కార్యక్రమాలకు జనాలను తరలించేందుకు కాషాయ రంగు పూస్తున్నారని, దీని వల్ల సంస్థకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆ పార్టీ నేత మనీష్ దోషి అభిప్రాయపడ్డారు. కాగా, మరో ఆరు నెలల్లో గుజరాత్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.