సీఎం బంధువు మృతి..అంబులెన్స్ ఆలస్యమే కారణం - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం బంధువు మృతి..అంబులెన్స్ ఆలస్యమే కారణం

October 9, 2019

అంబులెన్సు ఆలస్యంగా రావడంతో సీఎం విజయ్ రూపాని బంధువు మృతిచెందిన సంఘటన గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. సీఎం విజయ్ రూపానికి సోదరుడు వరుసయ్యే అనిల్ సంఘ్వీ మృతిచెందాడు. అనిల్‌ అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సు నెంబర్‌కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఇంతలో అనిల్ కన్నుమూశారు. 

Ambulance.

వాస్తవానికి అంబులెన్స్ సిబ్బంది ఒకచోటుకి రావాల్సింది మరోచోటకు వెళ్లారు. వెంటనే తప్పును గ్రహించి అంబులెన్సు సిబ్బంది అనిల్ ఇంటికి చోటుకు వచ్చే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంబులెన్స్ టైంకి వచ్చి ఉంటే ఆయన ప్రాణాలు దక్కి ఉండేవని కుటుంబ సభ్యులు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాజ్‌కోట్ కలెక్టర్ దర్యాప్తు జరుపుతున్నారు. అనిల్‌ మృతిచెందడంతో సీఎం విజయ్ విషాదంలో మునిగిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.