బట్టల గోడౌన్‌లో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

బట్టల గోడౌన్‌లో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి 

November 4, 2020

Gujarat cloth warehouses

బట్టల గోడౌన్‌లో ఉన్నట్టుండి చెలరేగిన మంటల్లో 9 మంది సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయడ్డారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నానుకాకా ప్రాంతంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది.  పిప్లాజ్ రోడ్‌లోని టెక్స్‌టైల్ గోడౌన్‌లో భారీ మంటలు, పేలుళ్లు సంభవించాయి. కొన్ని నిమిషాల్లో గోడౌన్ అంతా మంటలు వ్యాపించాయి. భవనం కుప్పకూలిపోయింది. షార్ట్ సర్కూట్ లేదా కాల్చిపారేసిన సిగరెట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. 

మంటలు, దట్టమైన పొగ అలముకోవడంతో సహాయక చర్యలకు కూడా వీలుకాకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు చెప్పారు. గుజరాత్‌లో కొన్నాళ్లుగా ఫ్యాక్టీరీల్లో భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. లాక్‌డౌన్‌లో మూతపడిన పరిశ్రమలను సరైన తనిఖీలే చేయకుండా తిరిగి తెరవడంతో ప్రమాదాలు పెరిగాయి.