పచ్చిన కాపురం అశ్లీల వీడియోల మూలంగా నాశనమైంది. రోజూ రాత్రిపూట పో* ర్న్ వీడియోలు చూస్తున్నాడని మందలించిన భార్య అతని చేతిలో బుగ్గిపాలైంది. అతడు కోపం పట్టలేక ఆమెకు నిప్పంటించి చంపేశాడు. గుజరాత్‌లోని సూరత్‌లో నాలుగు రోజుల కిందట ఈ దారుణం జరిగింది. కతార్గాం ప్రాంతానికి చెందిన కిశోర్ పటేల్, కాజల్ భార్యాభర్తలు. కాజల్ మొదటి భర్త ఐదేళ్ల కిందట చనిపోవడంతో కిశోర్‌ను ప్రేమించి గత ఏడాది పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు కాపురం బాగానే సాగింది. అయితే కిశోర్ అశ్లీల వీడియోలకు అలవాటు పడ్డాడు. ఆదివారం రాత్రి మొబైల్‌లో అశ్లీల వీడియోలు చూశాడు. అవి చూడకూడదని కాజల్ చెప్పింది.
అయినా భర్త వినకుండా చూస్తూనే ఉండిపోయాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. పొద్దున లేవగానే మళ్లీ కొట్లాడుకున్నారు. కిశోర్ కోపం పట్టలేక కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. తీవ్రంగా గాయపడిన కాజల్‌ను ఇరుగు పొరుగువారు ఆస్పత్రిలో చేర్చారు. శరీరం 40 శాతానికిపైగా కాలిపోవడంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. చనిపోయేముందు పోలీసులు ఆమె వాంగ్మూలం రికార్డు చేసుకుని కిశోర్‌ను అరెస్ట్ చేశారు.