Gujarat farmer living in iron cage, fearing leopard attacks
mictv telugu

పులికి భయపడి బోనులో జీవిస్తున్న మనిషి..

February 22, 2023

Gujarat farmer living in iron cage, fearing leopard attacks

ఏ రాత్రి పూటో ఇంటి దగ్గర పిల్లి కనిపిస్తేనే భయంతో జడుసుకుంటాం. మరలాంటిది పులి కలిపిస్తే! అది కూడా మనుషులు తిరగని చోట, రాత్రిపూట కనిపించి, మనపైకి పంజా విసిరితే! దృశ్యం రక్తచరిత్రే కదా. అలా జరగకూడదని ఓ రైతు తనే బోనులోకి వెళ్లిపోయాడు. పులి బారిని ప్రాణం కోపాడుకోవడానికి జూలో బంధించిన ప్రాణిలా మారాడు. గుజరాత్ రాష్ట్రంలోని ఆరావళి జిల్లా భాట్ కోట గ్రామంలో ఈ వింత నడుస్తోంది. ఆ ప్రాంతంలోని చిరుతపులులు తరచూ రైతులపై దాడి చేస్తున్నాయి.

రాత్రిపూట పొలాలకు కాపలాగా పడుకుంటున్నవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పులి దాడి చేసినా దానికి చిక్కకుండా ఉండేందుకు ఓ రైతు బోను తయారు చేయించుకుని పొలానికి తీసుకెళ్లి అక్కడే గడుపుతున్నాడు. జిల్లాలో 15 గ్రామాల్లో పులుల భయం ఉందట. వాటిని కట్టడం చేయడం అధికారులకు కూడా సాధ్యం కాని పని కాబట్టి, ఆత్మరక్షణ కోసం బోనెక్కక తప్పడం లేదంటున్నాడు పెద్దాయన.