మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా గుజరాత్ మాజీ సీఎం! - MicTv.in - Telugu News
mictv telugu

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా గుజరాత్ మాజీ సీఎం!

July 1, 2020

caretaker

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా ఆనందీబెన్ పటేల్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ కుమార్ మిట్టా ఆమెతో ప్రమాణం చేయించారు. మధ్యప్రదేశ్‌ ప్రస్తుత గవర్నర్‌ లాల్జీ టాండన్‌ శస్త్రచికిత్స కోసం లక్నో వెళ్లారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్‌ పటేల్‌కు మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను కేంద్రం అప్పగించింది.

లాల్జీ టాండన్‌ కోలుకునే వరకు రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఆమె వ్యవహరిస్తారు. ఆనందీబెన్ పటేల్‌ ఉత్తరప్రదేశ్‌కు బదిలీకాక ముందు మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్నారు. గుజరాత్ సీఎం గా ఉన్న మోదీ 2014లో పీఎం అయిన సంగతి తెల్సిందే. అప్పుడు రెండు సంవత్సరాల పాటు ఆనందిబెన్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.