Gujarat former deputy cm nitin patel Ghar Ghar tiranga
mictv telugu

మాజీ డిప్యూటీ సీఎంపైకి దూసుకొచ్చిన ఆవు.. వీడియో

August 13, 2022

Gujarat former deputy cm nitin patel Ghar Ghar tiranga

ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా ఘనంగా సాగుతోంది. ప్రజలు, రాజకీయ నాయకులు మువ్వున్నెల జెండాలతో సందడి చేస్తున్నారు. దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. దేశభక్తి జెండాల్లో కాదు, గుండెల్లో ఉంటుందని, బీజేపీ ప్రభుత్వం కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదని కొందరంటున్నారు.

ఆ సంగతి పక్కన బెడితే గుజరాత్‌లో ఘర్ ఘర్ తిరంగా యాత్రలో చిన్నపాటి అపశ్రుతి చోటుచేసుకుంది. తిరంగా జనసందోహానికి జడిసిన ఓ వీధి ఆవు జనం మీద పడి తొక్కుకుంటూ పోయింది. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఆవు రాష్ర్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌ పైకి కూడా వచ్చింది. దీంతో ఆయన కిందపడిపోయారు. మోకాలికి గాయమై కట్టుకట్టించుకున్నారు. కాగా, 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఆజాదీ అమృత్ మహోత్సవ్, ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాల కోసం= కోట్లాది జెండాలు సిద్ధమవుతున్నాయి.