Gujarat government has stopped traffic fines for a week
mictv telugu

దీపావళి గిఫ్ట్.. వారం పాటు ట్రాఫిక్ జరిమానాలు ఉండవు

October 22, 2022

Gujarat government has stopped traffic fines for a week

దీపావళి పండుగ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం వాహనదారులకు తీపి కబురు చెప్పింది. ఒక రకంగా ప్రభుత్వం ఇస్తున్న పండుగ బహుమానం అనుకోవాలేమో. వారం రోజుల పాటు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా ఎలాంటి జరిమానాలు విధించబోమని ఆ రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు.

ఇలా చేయడం వల్లనైనా రూల్స్ అతిక్రమించేవారు మారతారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. జరిమానాకు బదులు పోలీసులు పూలతో సత్కరించి నిబంధనలు పాటించమని మర్యాదగా చెప్తారని వివరించారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంతమంది స్వాగతించగా, మరికొందరు విమర్శిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని అంటుండగా, మరికొందరు మాత్రం దీని వల్ల ట్రాఫిక్ అస్తవ్యస్తం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.