బీజేపీపై మంచు లక్ష్మి ఘాటు సటైర్ - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీపై మంచు లక్ష్మి ఘాటు సటైర్

December 19, 2017

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు గ్యారంటీగా తెచ్చుకుంటామని చెప్పి స్వల్పమెజారిటీకే పరిమితమైన బీజేపీపై సటైర్లు పేలుతున్నాయి. కాషాయదళానికి 99 సీట్లే రావడంతో.. ఇప్పుడు మీరు నిజంగానే హ్యాపీగా ఉన్నారా అని ప్రకాశ్ రాజ్.. ప్రధాని నరేంద్ర మోదీని అడిగిన సంగతి తెలిసిందే. దీనిపై నటి మంచు లక్ష్మి కూడా సటైర్ వేశారు.‘ఫౌండ్ దిస్ ఫన్నీ’ అంటూ ఒక ట్వీట్ చేశారు. ‘మొత్తం  182 సీట్లున్న గుజరాత్‌లో అమిత్ షా 150 సీట్లను అడిగారు. గుజరాతీలు మొత్తం సీట్ల నుంచి 28 శాతం జీఎస్టీని తీసేసి 99 సీట్లు ఇచ్చారు. 150లో 28 శాతం తీసేస్తే మిగిలేది 99 సీట్లు’ అని ట్వీటారు. 182లో 28 శాతం అంటే 51 అవుతుంది. బీజేపీ కోరిన 150 సీట్లలో 51 సీట్లను తీసేస్తే మిగిలేది 99. అవే బీజేపీకి వచ్చాయని మంచు లక్ష్మి వివరణ.