10 కోట్లు ఇస్తే మోదీ సెక్స్ సీడీ చేయిస్తా - MicTv.in - Telugu News
mictv telugu

10 కోట్లు ఇస్తే మోదీ సెక్స్ సీడీ చేయిస్తా

December 6, 2017

గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తిట్టిపోసుకోవడాలు తీవ్ర రూపం దాల్చాయి. కాంగ్రెస్ నేత రాహుల్, ప్రధాని మోదీల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతుండగా, పటేల్ వర్గం నేత హార్దిక్ పటేల్ కూడా తానేం తక్కువ తినేదని నిరూపించుకుంటున్నారు. తన సెక్స్ సీడీలంటూ బీజేపీ నకిలీ సీడీలను ప్రచారం చేస్తోందని కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న  హార్దిక్ మండిపడ్డం తెలిసిందే.

హార్దిక్‌తో విలేకర్లు తాజాగా ఈ సీడీల అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు. దీనిపై ఆయన భగ్గుమన్నాడు. ‘ఆ సీడీ నకిలీది. మార్ఫింగ్ చేశారు. ఈ సంగతి వందసార్లు చెప్పాను.. నాకు రూ. 10 కోట్లు ఇస్తే  ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీల సెక్స్ సీడీలను బయటికి వదులుతాను.  కంప్యూటర్ లో గ్రాఫిక్స్ సాయంతో వారిని సెక్స్ సీడీల్లోకి  చొప్పించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.. ’ అని అన్నాడు. తన పేరుతో ప్రచారం చేసిన సీడీలు బీజేపీ దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు.

గుజరాత్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, 22 ఏళ్ళ యువకుడి సెక్స్ సీడీలను కోరుకోవడం లేదన్నారు. ఆ మాటకొస్తే ఇంటర్నెట్‌లో ఆ సీడీలకు మించిన సెక్స్ సీడీలు బోలెడు వున్నాయని అన్నారు. నోట్లరద్దు, హామీల ఉల్లంఘన.. వంటి కారణాలతో. ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ఇలాంటి నీచానికి పాల్పడుతోందని హార్దిక్ మండిపడ్డాడు.