చదువు కనిపెట్టిన వాడిని ఉతికి ఇస్త్రీ చేస్తా.. - MicTv.in - Telugu News
mictv telugu

చదువు కనిపెట్టిన వాడిని ఉతికి ఇస్త్రీ చేస్తా..

November 14, 2019

 చిన్నతనంలో స్కూల్‌కి వెళ్లాలంటే ఎవ్వరికైనా కష్టంగా ఉంటుంది. ఉదయాన్నే లేవాలి, బ్రష్ చేయాలి, స్నానం చెయ్యాలి. తినాలి స్కూల్‌కి వెళ్ళాలి. బడి నుంచి వచ్చిన తరువాత ట్యూషన్‌కు వెళ్ళాలి. అక్కడి నుంచి వచ్చిన తరువాత హోమ్ వర్క్ చేయాలి. ఇంకా డ్రాయింగ్ లాంటి క్లాసెస్ ఏమైనా ఉంటే వాటికీ వెళ్ళాలి. దీంతో గుజరాత్‌కు చెందిన ఓ చిన్నారి విసిగెత్తిపోయింది. విద్య వ్యవస్థను కనిపెట్టిన వ్యక్తి కనిపిస్తే నీళ్లలో ముంచి తీసి ఇస్త్రీ చేస్తా అంటుంది. 

ఆమె ఫిర్యాదుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘దేవుడు ఈ విద్యా వ్యవస్థను ఎందుకు ప్రశాంతంగా తీర్చిదిద్దలేదు’ అని ప్రశ్నిస్తోంది. అలాగే మోదీ గురించి ప్రశ్నించగా..’మోదీని ఒక్కసారి ఓడించాల్సిందే అంటోంది’. స్కూల్ జీవితం నుంచి సెలవు కావాలి అంటోంది. ఇంట్లో అమ్మానాన్న, అక్కలు తిడతారు.. స్కూల్‌లో టీచర్ తిడుతుంది.. ట్యూషన్ టీచర్ తిడుతుందని తన బాధను తెలియజేస్తోంది. వీరేందని నుంచి వెంటనే విముక్తి కావాలని కోరుతోంది. చిల్డ్రన్స్ డేకు ముందు రోజు నవంబరు 13న షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మొదటగా ఈ వీడియోను అరుణ్ బోత్రా అనే పోలీసు అధికారి పోస్ట్‌ చేశారు. దీనిని ఇప్పటికే 2లక్షల 60వేల మంది చూడగా, 9వేలకు పైగా లైక్ కొట్టారు. ఆ బాలిక చెప్తోన్న స్టైల్ అందరినీ ఆకట్టుకుంటోంది. పాపం చిన్నారి కష్టాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మేం కూడా స్కూల్ టైంలో ఇలానే అనుకునేవాళ్లం అని గుర్తు చేసుకుంటున్నారు.