బాబా రాందేవ్ ఇదేం పని... - MicTv.in - Telugu News
mictv telugu

బాబా రాందేవ్ ఇదేం పని…

June 19, 2017


పతాంజలి రాందేవ్ బాబాకు పనిలేనట్టు ఉంది. టీవీలో అడ్మర్టైజ్ మెంట్లతో జనాల్ని చావగొట్టడమే కాదు మహాత్ముడిని సైతం వదల్లేదు. ఏకంగా మహాత్మా గాంధీ స్మృతివనాన్ని వేర్ హౌజ్ లా మార్చేశాడు. అడ్డమైన వస్తువులతో దుకాణం పెట్టేశాడు. …గుజరాత్ లో బాబాకు ఏ ప్లేస్ దొరకలేదా…ఎందుకు ఇలా చేశాడు..?
గుజరాత్ లోని మహాత్మా గాంధీ స్మృతి ఖండ్ లో మొత్తం 28 గదులున్నాయి. వీటిని పతాంజలి నెయ్యి పాకెట్లు, రగ్గులు, బ్యానర్లతో నింపేశారు. 12 రూమ్ లలో వీటిని సర్దేశారు. మిగతావి సిబ్బందికి ఇచ్చేశారు. యోగా డే సన్నాహాల్లో భాగంగా ప్రచారం చేసేందుకు వచ్చిన వాలంటీర్లకు ఇచ్చారు. దీనిపై అధికారుల్ని ప్రశ్నిస్తే తమకేం తెలియదంటున్నారు. స్మారక కేంద్రంలో పతాంజలికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియదంటున్నారు.
బ్రిటీష్ పాలనలో ఇది కోర్టు రూమ్. 1922లో మహ్మాత్మా గాంధీకి ఆరేళ్ల ఏళ్ల శిక్ష కూడా విధించింది. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక ఈ సర్క్యూట్ హౌజ్ ని మహ్మాత స్మృతి కేంద్రంగా మార్చారు. ఇందులోకి బాపు ఫోటోలు , పెయింటింగ్స్ , ముఖ్యమైన పైల్స్ ను ఉంచారు.ఇలాంటి చారిత్రాక ప్రదేశాన్ని పరుపులు, టీ షర్టులు, క్యాప్స్ తో పతాంజలి నింపేసింది.దీంతో బాపు ఫోటోలు కనిపించడం లేదు. ఇది మహాత్ముడ్ని అవమానించడమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.