అక్కడి మున్సిపాలిటీల్లో హెల్మెట్ తప్పనిసరి కాదు! - MicTv.in - Telugu News
mictv telugu

అక్కడి మున్సిపాలిటీల్లో హెల్మెట్ తప్పనిసరి కాదు!

December 4, 2019

కేంద్రప్రభుత్వం కొత్త మోటార్ వెహికిల్ చట్టాన్ని తీసుకొచ్చి ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాలు అమాంతం పెంచిన సంగతి తెల్సిందే. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గుజరాత్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు నిర్దేశించిన జరిమానాలను బాగా తగ్గించింది. తాజాగా గుజరాత్ రాష్ట్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Gujarat makes.

మున్సిపాలిటీ పరిథిలో బైక్స్ నడిపేటపుడు హెల్మెట్లను ధరించడం తప్పనిసరి కాదని ప్రకటించింది. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర, జాతీయ హైవేలపై ప్రయాణించేటపుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని పేర్కొంది. గుజరాత్ మంత్రి ఆర్‌సీ ఫైదు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణాలను నిరోధించేందుకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేశామన్నారు. చాలా మంది ప్రజలు ఆగ్రహంతో ఫిర్యాదులు చేస్తున్నారని ఫైదు చెప్పారు. నగరాలు, పట్టణాల్లో చిన్న చిన్న పనులకు వెళ్ళేటపుడు కూడా హెల్మెట్లను ధరించాలంటే కష్టంగా ఉంటోందని, కూరగాయల దుకాణానికి వెళ్తే, హెల్మెట్‌ను ఎక్కడ పెట్టాలో తెలియడంలేదని వాహనదారులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు.