అడ్డదారిలో వెళ్లడానికి..  81 ఏళ్ల ముసలోడిగా వేషమేసి - MicTv.in - Telugu News
mictv telugu

అడ్డదారిలో వెళ్లడానికి..  81 ఏళ్ల ముసలోడిగా వేషమేసి

September 10, 2019

Gujarat Man Arrested at Delhi Airport.

మారువేషంతో ఎయిర్ పోర్ట్ సిబ్బందినే బురిడీ కొట్టించాలని ప్రయత్నించిన గుజరాత్ యువకుడు కటకటాలపాలయ్యాడు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. న్యూయార్క్ విమానం ఎక్కేందుకు వచ్చి చివరి నిమిషంలో తన బండారం బయటపడింది. అతన్ని  అదుపులోకి తీసుకున్న పోలీసులు మారువేషం వేయడానికి కారణాలను తెలుసుకుంటున్నారు. 

అహ్మదాబాద్ జయేష్ పటేల్  అనే 32 సంవత్సరాల యువకుడు అమ్రిక్ సింగ్ పేరుతో  81 సంవత్సరాలు ఉన్న వ్యక్తి వేషంలో న్యూయార్క్ వెళ్లేందుకు వచ్చాడు. నెరిసిన జుత్తు.. మాసిన గెడ్డం వేసుకొని తలపాగా ధరించి నడవలేని స్థితిలో ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నాడు. వయోధికుడు కావడంతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది కూడా సహాయం చేశారు. అయితే ఆ సమయంలో అతని హావభావాలు సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చేలా చేశాయి. చర్మం కూడా ముడతలు పడకపోవడంతో పాస్ పోర్టును జాగ్రత్తగా పరిశీలించారు. పాస్‌పోర్ట్‌లో వయస్సును దిద్దినట్టు గుర్తించారు. తప్పుడు పాస్‌పోర్టుతో విదేశాలకు వెళ్తున్నట్టు తెలుసుకొని అరెస్టు చేశారు.