వీడియో : ఇనుప గొలుసులతో కొట్టుకున్న గుజరాత్ మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : ఇనుప గొలుసులతో కొట్టుకున్న గుజరాత్ మంత్రి

May 28, 2022

గుజరాత్ రాష్ట్ర మంత్రి అరవింద్ రయానీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజ్ కోట్‌లో జరిగిన ఓ పూజా కార్యక్రమంలో పాల్గొన్న రయానీ ఇనుప గొలుసులతో తన వీపుకేసి కొట్టుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడంతో కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మంత్రిగా ఉంటూ అశాస్త్రీయమైన చర్యలతో మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడం దురదృష్టకరమని ఆ పార్టీ గుజరాత్ అధికార ప్రతినిధి మనీష్ దోషి అభివర్ణించారు. అయితే మంత్రి చర్యను అధికార బీజేపీ సమర్ధించుకుంది. నమ్మకానికీ, మూఢనమ్మకానికీ మధ్య పలుచటి గీత మాత్రమే తేడా ఉంటుందని స్పష్టం చేసింది. ఇంతకీ మంత్రి రయానీ ఎందుకలా కొట్టుకున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ‘నా చిన్న నాటి నుంచి ఆ దేవతకు నేను భక్తుడుని. మా స్వగ్రామంలో కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. దీన్ని మూఢనమ్మకంగా చూడవద్దు. మా దేవతను ఆరాధించి పూజిస్తున్నాం. ఇది వ్యక్తిగత మత విశ్వాసాలకు సంబంధించినది’ అని వివరణ ఇచ్చారు. మొత్తానికి రయానీ చేసిన పని ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.